రష్యా నుంచి వెనక్కి వెళ్లిపోతున్న ఉత్తర కొరియా సైనికులు

రష్యా నుంచి వెనక్కి వెళ్లిపోతున్న ఉత్తర కొరియా సైనికులు
  • ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా కిమ్
  • 10 వేల మంది సైనికులను రష్యాకు పంపించిన ఉత్తర కొరియా
  • కొరియన్ సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదన్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యాకు 10 వేల మంది సైనికులను కిమ్ పంపించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధికారులు సంచలన ప్రకటన చేశారు. 
 
తమతో పోరాడలేక కిమ్ సైనికులు రష్యా నుంచి వెనుదిరుగుతున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. తమతో జరుగుతున్న యుద్ధంలో గత మూడు వారాలుగా ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదని చెప్పారు. తమ సైనికులను ఎదుర్కోలేక వారు వెనుదిరుగుతున్నారని తెలిపారు.